దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ "స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. ఇరవైయేళ్ల యువకుడు అరవైయేళ్ల మహిళ ఎలా భార్యాభర్తలు అయ్యారనేది సినిమా కథ. ఇటీవల గోపీచంద్ మలినేని గారు విడుదల చేసిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మారుతిగారి చేతుల మీదుగా ఈ రోజు 'అచ్చమైన తెలుగింటి సత్య కశ్యప్ చక్కటి బాణీలు ఇచ్చారు. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటల్ని విడుదల చేస్తాం" అని అన్నారు.
శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా - విష్ణు తేజ పుట్ట, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఎడిటర్: మహేష్, నేపథ్య సంగీతం: మహిత్ నారాయణ, స్వరాలు: సత్య కశ్యప్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.