ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటిస్తూ మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్‌లు ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను సోమవారం నాడు, పాటను బుధవారం నాడు విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు.
ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాటు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ 'ఆరాధ్య'తో మరో సారి 'ఖుషి' సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్. సెప్టెంబర్ 1న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.