స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఇంటి నెం.13

బుధవారం, 15 డిశెంబరు 2021 (16:09 IST)
Inti No.13lo drusham
హార‌ర్ చిత్రాల్లో ఓ డిఫ‌రెంట్ ట్రెండ్‌ని క్రియేట్ చేసిన సినిమా ‘కాలింగ్‌ బెల్‌’. ఈ చిత్ర విజ‌యం అందించిన స్పూర్తితో త‌న రెండో సినిమాగా ‘రాక్షసి’ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ప‌న్నారాయ‌ల్‌. ఈ సినిమా కూడా విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్స్‌లో రూపొందిన సినిమాగా పేరు తెచ్చుకుంది. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినిమా స్పాన్ బాగా పెరిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి తెలుగు సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని త‌న మూడో ప్ర‌య‌త్నంగా ఒక కొత్త పాయింట్‌తో ప‌న్నా రాయ‌ల్ రూపొందించిన సినిమా ‘ఇంటి నెం.13’. 
 
- త‌న గ‌త రెండు సినిమాల కంటే స్క్రిప్ట్ ప‌రంగా, టేకింగ్ ప‌రంగా, బ‌డ్జెట్ ప‌రంగా ఎన్నో రెట్లు గొప్ప‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు ప‌న్నా రాయ‌ల్‌. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. సినిమా జోన‌ర్‌కి త‌గ్గ‌ట్టుగానే ఈ ఫ‌స్ట్‌లుక్‌లో ఉన్న‌ది ఎవ‌రు అనేది తెలియ‌కుండా ఆడియ‌న్స్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు ద‌ర్శ‌కులు ప‌న్నా రాయ‌ల్‌. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు.
 
- ఈ సినిమా విశేషాల‌ను చిత్ర ద‌ర్శ‌కుడు ప‌న్నారాయ‌ల్ తెలియ‌జేస్తూ ‘‘ఆడియ‌న్స్‌కి ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇచ్చే సినిమా ఇది. ఇప్ప‌టివ‌ర‌కు స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్స్ చాలా వ‌చ్చాయి. కానీ, ఈ సినిమాలోని యునీక్ పాయింట్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌లో రూపొందింది. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని నిర్మించ‌డం జ‌రిగింది. నేను చెప్పిన కొత్త పాయింట్‌ని విని ఎంతో ఇంప్రెస్ అయిన మా నిర్మాత హేస‌న్ పాషాగారు ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా చాలా రిచ్‌గా ఈ సినిమాని నిర్మించారు.  
 
 - ఈరోజు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ ఆడియ‌న్స్‌కి డెఫినెట్‌గా న‌చ్చుతుంది. వ‌చ్చేవారం టీజ‌ర్ రిలీజ్ చేస్తాం. అతి త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం‘‘ అన్నారు.
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌,  ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, కొరియోగ్ర‌ఫీ: కె.శ్రీ‌నివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు