ఈ సందర్భంగా నటుడు ఆనంద్ రాజ్ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత మళ్లీ ఇంటి నెం.13 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. చాలా మంచి సినిమా చేసానన్న సంతృప్తి ఈ సినిమా నాకు ఇచ్చింది. పన్నా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మణికర్ణన్ మంచి ఫోటోగ్రఫీ అందించారు. వినోద్ యాజమాన్య మ్యూజిక్ సినిమాకి చాలా హైలైట్ అవుతుంది. నిర్మాత హేసన్ పాషాగారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది అన్నారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. పన్నా మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత హేసన్ పాషా గారు ఈ సినిమా ఇచ్చారు. అందరూ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇది ఏ భాషకైనా, ఏ ప్రాంతానికైనా సూట్ అయ్యే సినిమా కాబట్టి నేను దీన్ని గ్లోబల్ మూవీ అంటున్నాను అన్నారు.
డైరెక్టర్ పన్నా రాయల్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూసి అందరూ బాగుందని చెప్తున్నారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి నిర్మాత హేసన్ పాషాగారు ఇచ్చిన ఫ్రీడమే కారణం. ఒక సాంగ్‌ని గోవాలో చేద్దాం అని అంటే... కాదు, ఇండోనేషియాలో చెయ్యమని ఎంకరేజ్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటుంది. సెకండాఫ్ ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ తల తిప్పకుండా చూస్తారు. టెక్నికల్‌గా మాత్రం చాలా హై రేంజ్‌లో ఉంటుంది అన్నారు.
సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెన్స్ ఎంతో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేశాను. ట్రైలర్ చూసిన తర్వాత నా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్ ఎస్.కె.చలం, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.మణికర్ణన్, హీరోయిన్ శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, గుండు సుదర్శన్, పాటల రచయిత రాంబాబు గోశాల తదితరులు పాల్గొన్నారు.