ఇద్దరమ్మాయిలతో చిత్రం ఫేమ్ అమలా పాల్, దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలైనట్లు కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అందుకే అమలాపాల్ వచ్చిన అవకాశాలను వచ్చినట్లు నటించుకుంటూ పోతుందని టాక్. గతంలో అన్నీ పార్టీలకు తన భర్తతో కలిసొచ్చే అమలాపాల్.. ఒక నెల నుంచి విడిగా వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్‌తో అమలా పాల్ కలిసి కనిపించట్లేదు.
కానీ ఈ వార్తలపై విజయ్-అమలా పాల్ జంట నోరెత్తలేదు. మరోవైపు ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో జయం రవితో కొత్త సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నాడు. కాగా 2011 దైవ తిరుమగళ్ సినిమా సందర్భంగా అమలా పాల్, విజయ్ ప్రేమలో పడ్డారు. 2014లో వీరిద్దరికీ చెన్నైలో అట్టహాసంగా వివాహమైన సంగతి తెలిసిందే.