బుధవారం రాత్రి విరాటపర్వం ప్రీరిలీజ్‌లో ఆయన రానా మాట్లాడుతూ.. దర్శకుడు వేణు ఉడుగుల గారు ఎంతో నిజాయితీతో తను పెరిగిన ఊరులో వున్న పరిస్థితుల్లో ఒక భయానక నేపధ్యంలో ఒక అద్భుతమైన ప్రేమకథని చేశారు. సాయి పల్లవి నడుస్తుంటే పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు వుంటుంది. సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా వుండేది కాదు. సాయి పల్లవితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి అద్భుతమైన కథలు చేసే నిర్మాతలు అరుదుగా వుంటారు.
ఇలాంటి గొప్ప సినిమాని తీసిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. డానీ, దివాకర్ మణి , సురేష్ బొబ్బిలి ఇలా సాంకేతిక నిపుణులు గొప్పగా పని చేశారు. రవన్న దళం నవీన్ చంద్ర గారు ప్రియమణి గారు అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈశ్వరి రావు, నందితదాస్, జరీనా వహాబ్ ఇలా అందరూ గొప్పగా చేశారు. నాకు కథలు నచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. ఇది నటుడిగా నేను చేస్తున్న చివరి ప్రయోగం అనుకోవచ్చు. ఇకపై నా అభిమానులు గురించి సినిమాలు చేస్తా. విరాటపర్వం మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.