నాకు పదేళ్లలో రాని హిట్ ఇది. ఆయన అభిమానుల దాహం తీర్చిందిః దర్శకుడు సంపత్ నంది
శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:09 IST)
Director Sampath nandi
గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా సీటీమార్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలై విజయవంతమైంది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు సంపత్ నంది ఇలా తెలియజేస్తున్నారు.
- అన్నిచోట్ల మంచి స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు పడ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
- బాలీవుడ్‌లోని సినిమాలతో కలిపి పోల్చి చూసి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక పంపిణీదారులు, ఎగ్జిబిర్టలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథ అనుకున్న తర్వాత దాన్ని కమర్షియల్ యాంగిల్‌లో చేద్దామని అనుకున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ సినిమా చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చెప్పాను. యాక్షన్ మూవీ చేయడానికనే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాను. దానికి ఉమెన్ ఎంపవర్‌మెంట్, వాళ్లు ఓ ఉద్దేశం కోసం పోరాడటం వంటి ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అయ్యారు.
- ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ గురించి, అందులోని యాక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
- గౌతమ్ నంద తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనో, రివేంజ్ ఫార్మేట్‌లోనో సినిమా చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కాన్సెప్ట్ ఐడియాకు వచ్చింది. కబడ్డీ ఇండియాలో పెద్ద మాస్ గేమ్. అలాంటి మాస్ గేమ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే బావుంటుందనిపించింది. అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుకున్నాను.
* బెంగాల్ టైగర్ తర్వాత అంత మంచి డైలాగ్స్ ఈ సినిమాకు కుదిరాయని అంటున్నారు.
* నాకు కూడా గత పదేళ్లలో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ దాహం తీర్చింది. ఏ డైరెక్టర్‌కు అయినా ఓ హీరో, ఫ్యాన్స్ ఫీలయ్యే సినిమా చేస్తే దాన్ని కన్నా గర్వంగా ఫీలయ్యే క్షణమే ఉండదు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మోడ్‌లో ఉన్నాను
* ఒక కష్టం వచ్చినప్పుడు మనం అందరం కలిసిపోతుంటాం. ఇక్కడ గొడవలు పడే మనం అమెరికా వెళ్లగానే ఇండియన్స్ అనే భావన వస్తుంది. అలాగే ఉత్తరాదికి వెళ్లినప్పుడు తెలుగువాళ్లమనే ఫీలింగ్‌తో కలిసిపోతాం.
* నేను డైలాగ్స్ రాసుకునే సమయంలోనే ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోవాలనేదే నా ఉద్దేశం. అందుకే ముందు ఒకలా చూపించినా, క్లైమాక్స్‌లో అందరూ కలుసుకుని కప్ కొట్టుకొచ్చేలా చూపించాను.
* ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్ చేయడానికి ఇరవై రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్‌ను రెండు భాగాలుగా తీశాను. దాన్ని మిక్స్ చేసి ప్రేక్షకులు మెప్పించేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది.
* ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు, చివరి వరకు మనం గెలుస్తామా లేదా? అనిపించినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్‌కు మూడు రోజులు ఉన్నప్పుడు అరగంట కంటే ఎక్కువసేపు నిద్రపోలేదు.
* ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అయితే నిర్మాతలు మాకు సపోర్ట్‌గా నిలిచారు. కమర్షియల్ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకమైతే ఉండింది. కానీ తెలియని భయమొకటి లోలోపల రన్ అవుతుండింది. వినాయకుడు మా భయాలను పటాపంచలు చేసేశాడు.
* ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ప్రేక్షకుల విజయంగా భావిస్తున్నాను. థియేటర్‌కు ప్రేక్షకులు రావాలని అనుకోవడంతో ఈ సక్సెస్ దక్కింది.
* తమన్నాగారితో హ్యాట్రిక్ విజయం సాధించడం హ్యాపీ. అలా కుదిరిపోయింది.
* ఓటీటీ అనేది మంచి ఫ్లాట్‌ఫామ్ అనడంలో సందేహం లేదు. సినిమా చేసేటప్పుడు అది థియేటర్ మూవీనా, ఓటీటీ మూవీనా అని ప్లాన్ చేసుకుని చేస్తే బావుంటుంది.
* నెక్ట్స్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తాను.