సదరు యాంకర్ కూడా ఈ వ్యాఖ్యలకు షాక్ తిన్నా.. ఆ తరువాత ఏమి చెప్పాలో తెలియక నవ్వుకుంది. జగపతిబాబు ఓపెన్ మైండెడ్‌గా ఈ వ్యాఖ్యలు చేసినా.. చనిపోయిన తన తండ్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పర్సనల్ విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం ఏమిటని సినీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్‌లో అత్యధిక పారితోషకం అందుకునే అతి కొద్ది మంది నటుల్లో ఒకడిగా ఎదిగి పోయిన జగపతి బాబు ఆర్థికంగా కూడా మంచి స్థితికి చేరడంతో తన తండ్రి కోరికలను నెరవేర్చే పనిని ప్రారంభించాడు. తన తండ్రి స్థాపించిన ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ ను తిరిగి ప్రారంభించి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.