అడివి శేష్, శోభిత జంటగా రూపొందిన గూఢచారి చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో నటించిన జగపతిబాబు 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గూఢచారి టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ వేడుకలో జగపతిబాబు మాట్లాడుతూ... హీరోగా ఒక్క సినిమా చేస్తే చాలు.. అనుకంటే ముప్పై ఏళ్లు.. దర్శకులు, నిర్మాతలు, మీడియా, ప్రేక్షకులు అందరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకువచ్చారు. నన్ను ఇక్కడ ఇలా నిలబెట్టినందుకు.. అందరికీ మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఆ రోజు నా ఫస్ట్ మూవీకి చిరంజీవి గారు క్లాప్ కొట్టారు. నా ఫస్ట్ షాట్ స్కేటింగ్ చేసుకుంటూ రావాలి.
ఇక గూఢచారి గురించి చెప్పాలంటే... నా మీద ఒట్టు 30 ఇయర్స్‌లో నేను గడిపిన బెస్ట్ ఈవినింగ్ అంటే ఈ వేడుకలో పాల్గొనడమే. ఎందుకంటే... నాకు లైఫ్‌లో యాక్టింగ్ అసలు రాదు. కెమెరా ముందే నటిస్తాను. ఈ ఫంక్షన్ నా కోసం చేసారంటే... టీమ్ అందరికీ నమస్కారం. ఈ సినిమాకి వీళ్లు పడ్డ కష్టం చూసినప్పుడు ఎంత ముచ్చటేసిందంటే... ఇటువంటి టీమ్‌తో పని చేసాననే గర్వం ఇప్పటికీ ఉంది అన్నారు.