రాఘవేంద్రరావుకు జనసేనాని లేఖ.. పెళ్లి సందDపై కామెంట్

శనివారం, 31 జులై 2021 (12:09 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు జనసేనాని పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఇంతకాలం తెర వెనుక ఉండి ఎంతోమంది నటీనటులన్ని డైరెక్ట్ చేసిన మీరు... ఇప్పుడు తెర ముందుకు వచ్చి నటుడిగా కనిపించడం సంతోషకరమని లేఖలో పేర్కొన్నారు. 
 
ఇకపై మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది దిగ్గజ దర్శకులు ఎదురుచూడటం ఖాయమని చెప్పారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న 'పెళ్లి సందD' సినిమాలో రాఘవేంద్రరావు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. 
 
రోషన్‌కు తాతగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రోమోలో సూటు, బూటు వేసుకుని ఆయన చాలా స్టైలిష్‌గా కనిపించారు. వశిష్ట అనే పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కల్యాణ్ లేఖ రాశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు