సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు జేడీ చక్రవర్తి త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. నాలుగు పదుల వయస్సులో జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకోనున్నాడు. ఆర్జీవీ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ నాగార్జునతో తీసిన శివ చిత్రంలో జేడీ అనే పాత్ర ద్వారా చక్రవర్తి సినిమా ఆరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే చక్రవర్తి టాలీవుడ్లో మంచి స్థానాన్ని దక్కించుకున్నారు.