ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుకున్న సమయానికే ఈ సినిమా షూటింగ్ మొదలై వుంటే, దసరాకి విడుదల చేద్దామని అనుకున్నారు గానీ అలా కుదరడంలేదు. ఇంకా నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ రెండు చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచేలా కనిపిస్తున్నాయి. ఎలాగంటే మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అందువల్ల ఆయన ఈ సినిమాను సంక్రాంతికి థియేటర్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే, అబ్బాయ్ కూడా తన సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. దాంతో బాబాయ్.. అబ్బాయ్‌ల మధ్య పోటీ తప్పదేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.