శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం కుబేర. ధనుష్, నాగార్జున నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. ఇదిలా వుండగా, నేటితో ధనుష్ కెరీర్ మొదలుపెట్టి 23 సంవత్సరాలైంది. ఇందులో దేవా గా ధనుష్ నటిస్తున్నాడు. పక్కా మాస్ చిత్రంగా రూపొందుతోంది. భావోద్వేగాలు, డ్రామా, గ్రాండ్ విజువల్స్ కలిగిన మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ వంటి స్టార్ తారాగణం ఉంది.