కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కొన్ని థియేటర్లలో ఆడింది. నేటితో ఆహా ఓటీటీ దానిని తీసుకుంది. ఈ విషయాన్ని ఆయన చెబుతూ, నేటితో ఈ సినిమాకు చేసిన క్రుషి, రుణం తీరిపోయింది. ఈ సినిమా చేయడానికి అన్న, వదినలాంటి రాఘవ, పుణ్య వంటివారు నా కోసం పూజలు చేసిన సందర్భాలున్నాయి. మా తల్లికంటే ఎక్కువ ప్రేమ చూపారు. అలాగే నా కుటుంబసభ్యులకు థ్యాంక్స్.. మా అమ్మ మిమిక్రీ చేస్తున్నాను అంటే ఏమి అనలేదు.కళాకారుడిగా ఎప్పుడూ మరక అంటవద్దు అనేది. నా తమ్ముడు సాయి, మరదలు వీణ ఎంతో సపోర్ట్ చేశారు. నాజీవితంలోకి వచ్చిన సుజాత ధైర్యానిచ్చింది. నా కూతురు ఖ్యాతి సక్సెస్ ఇచ్చింది అన్నారు.
అలాగే, ఈ సినిమా గరుడ వేగ అంజి గారు మేకింగ్ గా దర్శకత్వం చేసి నన్ను నిలబెట్టారు. మరో సినిమా ఆయనతో చేయబోతున్నాను. సినిమా సక్సెస్ అనికాదు. ఆహా ద్వారా ఈ సినిమా మరింతగా ప్రేక్షకులకు చేరువుతుంది. రేపటితో ఈ సినిమా అవార్డు వచ్చేలా కష్టపడుతున్నాం. త్వరలో బంజారా అవార్డు హైదరాబాద్ లో ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కె.సి.ఆర్. కు పార్ట్ 2 కూడా వుండబోతోంది అని అన్నారు.