అయితే, ఆయన నటన తనకు ఎపుడూ ఆశ్చర్యం కలిగించేదన్నారు. ఆయనలాంటి నటుడిని తాను ఎపుడూ చూడలేదన్నారు. తన శిష్యుడుగా వచ్చిన రాజమౌళి ఇపుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. చిత్రపరిశ్రమకు రాజమౌళిని ఇచ్చాననే ఒక సంతృప్తి తనకు ఉందని, తనకు అది చాలని రాఘవేంద్ర రావు అన్నారు.
కాగా, చిత్రపరిశ్రంలో దర్శకేంద్రుడుగా గుర్తింపు పొందిన కె.రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అనేక వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించారు. ఎంతోమంది స్టార్ హీరోలుగా చేయడంతో పాటు ఇంతో మందికి నటన నేర్పించి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేశారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో కథాసుధ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇది ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రసార కార్యక్రమాల్లో భాగంగా ఆయన పైవిధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.