సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం... బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. తమిళం, తెలుగు, హిందీతో మరికొన్ని బాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది అన్న సంగతి పక్కన పెడితే... విడుదల ముందు నుంచే భారీ హైప్ ఉండటం, సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు వరల్డ్ వైడ్ దాదాపు 4000 స్క్రీన్లలో రిలీజ్ చేయడం, అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో ఓపెనింగ్స్ పరంగా కలిసొచ్చింది. ఫలితంగా తొలిరోజు బిజినెస్ అంచనాలను దాటిపోయింది.