రజినీకాంత్ 'కబాలి' చిత్రం విడుదల తేదీ ఖరారు!

శనివారం, 14 మే 2016 (14:44 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ''కబాలి''. ఈ చిత్రంలో రజినీకి జోడిగా రాధికా ఆప్టే నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ కార్యక్రమాల్లో యూనిట్ బిజిబిజీగా ఉంది. ఈ సినిమాలో తైవాన్ నటుడు విన్‌స్టన్‌ చావో విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ 1.6 కోట్ల మంది నెటిజన్లు వీక్షించారు. 24 గంటల్లోనే 20 మిలియన్ల మంది చూసిన ఈ టీజర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వెలువడింది. ఏంటంటే ''కబాలి'' సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా జూన్‌లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారు. 
 
అయితే, తాజాగా ఈ చిత్ర విడుద‌ల‌ తేదీని జూలై ఒకటో తేదీగా ఫిక్స్ చేశారు. జూలై 7లో విడుదల చేయాలని భావించినప్పటికి అదే తేదీన సల్మాన్ ఖాన్‌''సుల్తాన్‌'' చిత్రం రిలీజ్ అవ్వడంతో దానితో పోటీ లేకుండా జూలై ఒకటో తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించారట. ఇటీవల రిలీజైన టీజరే ఇన్ని రికార్డులు సృష్టిస్తే కబాలి విడుదలతో ఎన్ని రికార్డులు తిరగ రాస్తుందో మరి .

వెబ్దునియా పై చదవండి