Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

సెల్వి

శుక్రవారం, 24 అక్టోబరు 2025 (09:31 IST)
కన్నతల్లినే బాలుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కీల్‌కుప్పంవేలూరు గ్రామానికి చెందిన గుణశేఖరన్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య మహేశ్వరి (40), ఒక కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 
 
దీపావళి రోజున గుణశేఖరన్‌ భార్యకు చీర కొని తీసుకురాగా, ఆమె దానిని తీసుకునేందుకు నిరాకరించింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గుణశేఖరన్‌ భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో మహేశ్వరి కోపంగా ఇంటి నుంచి పొలానికి వెళ్లిపోయింది. 
 
అదే రోజు సాయంత్రం గ్రామ శివార్లలోని పొలాల్లో మహేశ్వరి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపగా షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చింది. 
 
దంపతుల మధ్య జరిగిన గొడవ గురించి తెలియడంతో తొలుత భర్త గుణశేఖరన్‌పైనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మహేశ్వరి కుమారుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో బుధవారం అతడిని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. 
 
చదువు విషయంలో తల్లి నిత్యం మందలించడంతో ఆమెపై కోపం పెంచుకున్నట్లు బాలుడు తెలిపాడు. దీంతో పోలీసులు బాలుడిని అరెస్టు చేసి, గురువారం జువైనల్‌ హోంకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు