ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నయాల్ది సాంగ్ ని మార్చి 31న రిలీజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ క్లాస్ లుక్‌లో, ఉర్రూతలూగించే మాస్ డ్యాన్స్ చేస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. బ్యాక్ డ్రాప్ లో కార్నివాల్ వాతావరణం, డ్యాన్స్ ట్రూప్ పండుగ వైబ్ ని పెంచుతోంది. నాయల్ది మాస్ డ్యాన్స్ నంబర్ అని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమా కోసం అజనీష్ లోక్‌నాథ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.
ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్