నందమూరి కళ్యాణ్‌రామ్, నటి విజయశాంతి, అర్జున్ S/o వైజయంతి చిత్ర బృందంతో కలిసి గురువారం తిరుమల ఆలయానికి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా బృందం గురువారం శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వేద పూజారులు చిత్ర బృందానికి ఆశీస్సులతో పాటు పవిత్ర తీర్థ ప్రసాదాలను అందజేశారు.