కనక దుర్గ అమ్మ వారే నన్ను రప్పించారు : శ్రీలీల

శనివారం, 28 అక్టోబరు 2023 (16:21 IST)
sreelela, mother Swarnalatha
భగవంత్‌ కేసరి విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర యూనిట్ శనివారంనాడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నాారు. పూజారులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలీల మాట్లాడుతూ, కనక దుర్గ అమ్మ వారిని చూసి పులకించిపోయాను. కనక దుర్గ అమ్మ వారే నన్ను రప్పించారు అంటూ తెలిపింది. 
 
anilravipudi and bhagavath unit
'ఆడ పిల్ల లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా వుండాలనే ఓ డైలాగ్‌ మీరు చూసే ఉంటారు. ప్రేక్షకులు సరిగ్గా అర్ధం చేసుకోవాలనే తపనతో ఆ పాత్రల్లో లీలమైన పనిచేశాను. ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య అనుబంధం, ప్రేమ వంటి బంధాన్ని చాలా హుందాగా చూపించారు. అనిల్‌ రావిపూడి అద్భుతంగా తీశారు. నా రియల్‌ లైఫ్‌ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్‌ అయిపోయాను అంటూ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు