'ఇందిరా గాంధీ' గా కంగనా రనౌత్!

గురువారం, 24 జూన్ 2021 (13:56 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరో బయోపిక్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో ఆమె నటించారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తరెకెక్కిన తలైవి చిత్రంలో కంగనా రనౌత్.. జయలలితగా నటించారు. ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
 
మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. అయితే, ఆ చిత్రం ఇందిరా గాంధీ బయోపిక్ కాదని... ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగనా వెల్లడించారు. 
 
ఈ సినిమాకు సాయి కబీర్ దర్శకత్వం వహిస్తారు. తన సొంత సంస్థ అయిన మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కంగనా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు