ఇటీవలే ముంబైలో కురిసిన వర్షం వల్ల బి-టౌన్ ప్రముఖ మహిళలపై రొమాంటిక్ మూడ్ ను క్రియేట్ చేసింది. కంగనా రనౌత్ మనసులోని మాటను అలా షేర్ చేసుకుంది. ఒంటరి వ్యక్తులు పగటి కలలు కంటారు. నా కోసం ఎవరు ఉద్దేశించారో దయచేసి చూపించు అంటూ ఆకాశాన్ని చూస్తూ కాప్షన్ పెట్టింది. తాజాగా పక్కన ఎవరైనా వుంటే ఆ ఎంజాయ్‌మెంట్ వేరే. అది కృతిలో చూశాను. అంటూ కృతి పెట్టిన పోస్ట్‌కు కంగన రిప్లయి ఇచ్చింది.
ఇంతకీ కృతిసనన్ ఏమిచేసిదంటే, ఆదివారంనాడు కురిసిన వర్షానికి నా మది పులకరించింది. అందుకే తను కారులో వెళుతున్న వీడియోను పెట్టింది. ఆమె, సోదరి నూపూర్ సనోన్‌తో పాటు, కదిలే కారులో కూర్చుని ఫన్నీ ముఖ కవళికలను చూపించింది. ప్రముఖ హేమంత్ కుమార్ పాట “హై అప్నా దిల్ టు అవారా” నేపథ్యంలో సాంగ్‌కు అనుగుణంగా ఇద్దరూ ముఖకవళికలు మారుస్తూ ఎంటర్‌టైన్ చేశారు. దీనికి కంగనా రియాక్ట్ అయింది. సో. సోషల్‌మీడియా వల్ల ఎంత ఎంటర్‌టైన్‌మెంటో గదా.