టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఏ చిత్ర పరిశ్రమ అయినా సరే... బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్క్రుతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్.సి బ్యానర్స్ పైన ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌ను దర్శకురాలు సంజనా రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ ఈ చిత్రానికి రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు. మరి... ఈ బయోపిక్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.