నటుడు సూర్య మూడు భిన్నమైన గెటప్స్‌తో '24'లో నటించాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తీకూడా ప్రయత్నిస్తున్నాడు. 'రౌద్రం' ఫేం గోకుల్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా 'కాష్మోరా' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చెన్నై - పూనమల్లె రహదారి సమీపంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ షూటింగులో కార్తీ, నయనతార, శ్రీదివ్య పాల్గొంటున్నారు. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అధునాతన సాంకేతికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ వుండటం విశేషం. దాదాపు పదిహేను నిమిషాల పాటు 3 ఫేస్ స్కాన్ చేసి చిత్రీకరించనున్నారు. గతంలో రజనీకాంత్ 'కొచ్చాడియాన్' సినిమాకు ఈ టెక్నాలజీ ఉపయోగించిన విషయం తెలిసిందే.
అయితే అప్పుడు మొత్తం శరీరాన్ని అంతటినీ స్కాన్ చేసి ఉపయోగించి తీసిన టెక్నాలజీ ని ప్రస్తుతం కార్తీ ఫేస్ వరకు మాత్రం స్కాన్ చేసి ఉపయోగిస్తున్నారు. గ్రాఫిక్స్‌ని 'బాహబలి' సినిమాకి పనిచేసిన మకుట సంస్థ సమకూరుస్తున్నది. ఈ సినిమాకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.