బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?

ఠాగూర్

బుధవారం, 12 మార్చి 2025 (14:23 IST)
బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్‍తో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు బీటౌన్ కోడై కూస్తోంది. దక్షిణాదిలో రాణిస్తున్న శ్రీలీల... ఇపుడు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తుంది. ఇందులోభాగంగా అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె ఓ చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కార్తిక్ ఆర్యన్ - శ్రీలీల మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అయితే, కొందరు మాత్రం వాళ్ళది కేవలం స్నేహం మాత్రమేనని అంటున్నారు. ఆ స్నేహంతోనే ఆమెను ఆర్యన్ తమ ఇంటికి ఆహ్వానించారని చెబుతున్నారు. మరోవైపు, వీరిద్దరి డేటింగ్ కథనాలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే, ఆర్యన్ తల్లి తమ ఇంటికి రాబోయే కోడలు ఎలా ఉండాలో చెప్పింది. 'ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా వైరల్‌గా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు