కాటమరాయుడు టీజర్ రిలీజ్.. పవన్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. ఎప్పుడో వచ్చాడు అన్నది ముఖ్యం కాదు.. (Video)

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:15 IST)
మెగాస్టార్ ఖైదీ నెం. 150, రామ్ చరణ్ ధ్రువ సినిమాలతో మస్తు ఖుషీగా ఉన్న మెగా ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్రీట్ ఇచ్చారు. శనివారం సాయంత్రం కాటమరాయుడు సినిమా టీజర్ రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమిళ కోలీవుడ్ హీరో అజిత్ నటించిన వీరమ్ సినిమాకు ఇది రీమేక్. కాటమరాయుడుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఇటీవల హైదరాబాద్ నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో పోరాట దృశ్యాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. అనంతరం చిత్ర యూనిట్ అనకాపల్లికి చేరుకోనుంది. అనకాపల్లిలో వేసే ఓ సెట్‌లో మిగిలిన షూటింగ్ జరగునుందని.. ఆపై సినిమాను రిలీజ్ చేసేందుకు సినీ యూనిట్ రంగం సిద్ధం చేసుకుంటుందని సమాచారం. 
 
ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ముందు టీజర్‌ను రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్‌లో దర్శకుడు డాలీ జోష్ నింపారు. కాటమరాయుడు సినిమా టీజర్ రిలీజ్ కావడంతో మెగా హీరోలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా ఖుషీని వ్యక్తం చేశారు. ఎప్పుడు వచ్చాడు అన్నది ముఖ్యం కాదు. రికార్డ్స్ బద్ధలు కొట్టామా లేదా అన్నదే ముఖ్యం అంటూ సాయిధరమ్ తేజ్.. కాటమరాయుడు టీజర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

 

వెబ్దునియా పై చదవండి