Keerthy Suresh Wedding: అట్టహాసంగా కీర్తి సురేష్ వివాహం (ఫోటోలు)

సెల్వి

గురువారం, 12 డిశెంబరు 2024 (16:36 IST)
Keerthy Suresh
రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి.. ఆ తర్వాత నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా.. ఇలా మంచి మంచి హిట్లతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తమిళం, మలయాళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఇప్పుడు హిందీలో బేబి జాన్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. 
Keerthy Suresh
 
ఈ నేపథ్యంలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంథోనితో ఏడడుగులు వేసింది. గోవాలో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెళ్లికి రెండు రోజుల ముందే డిసెంబరు 9న వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. 
Keerthy Suresh
 
కీర్తి తన చిన్న నాటి మిత్రుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Keerthy Suresh

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు