బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇపుడు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు హీరోగా నటించిన అభిషేక్... హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడుగా బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీతో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా కొంతకాలంగా సినీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యారు.
హీరోగా చేసే వారు సైడ్ క్యారెక్టర్‌గా చేయాల్సి రావడం చాలా కష్టమైన విషయమని, సినీ ఇండస్ట్రీ చాలా దారుణమైన ప్రదేశమన్నారు. ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదని, రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుందన్నారు. ఆ బాధ నుంచే స్ఫూర్తి పొందాలని, తిరిగి సెంటర్‌లోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నాడు.