సూపర్‌స్టార్ కృష్ణకు, మురళీమోహన్ కూ చాలా అవినాభావ సంబంధం వుంది. ఇద్దరూ కాలేజీలో క్లాస్ మేట్స్. ఇద్దరూ సౌమ్యులు. అందుకే క్లాస్‌లో ముందు కూర్చోపెట్టేవారు టీచర్లు. వీరి అవినాభావ సంబంధం గురించి మురళీమోహన్ ఇలా తెలియజేస్తున్నాడు. కృష్ణగారిది మంచి మనసు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం కానీ, నోరుజారడంకానీ వుండదు. ఆయన అనుకున్నది సాధించుకునే తత్త్వం. మేం చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి గురించి చెప్పేవాడు. 1964కు ముందు మదరాసు వెళ్ళి ప్రయత్నాలుచేశాడు. కానీ చిన్నపాటి వేషాలు రావడంతో వెనక్కువచ్చాడు. ఆ తర్వాత ఆంధ్రప్రజానాట్యమండలి వారితో నాటకాలు వేసి రాజారావుగారి దగ్గర మెలకువలు నేర్చుకున్నారు.