నోయల్, ఎస్తేర్, శ్రీ, అర్జున్ మీనన్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కృష్ణమోహన్, నరేన్, శ్రీరామ్ కందుకూరి నిర్మాతలు. క్రాంతి వడ్లమూడి దర్శకుడు. షెడ్యూల్ చివరి రోజున చిత్ర సెట్లో యూనిట్ సభ్యులందరూ పాల్గొనగా హీరో శ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 'ప్రధాన తారాగణమంతా పాల్గొనగా తొలి షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాము. `సస్పెన్స్ థ్రిల్లర్గా సాగే చిత్రమిది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. నటీనటులు, సాంకేతిక నిపుణులు పూర్తి సహకారం అందించడంతో తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేశాము. ఈ షెడ్యూల్ చివరి రోజున లొకేషన్లో హీరోల్లో ఒకరైన శ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు.