ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణ శేఖర్ మాట్లాడుతూ.. ఈ రోజు శాకుంతలం అనే ప్యాన్ ఇండియా సినిమాని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ అండ్ గుణ టీం వర్క్స్) కలిసి సంయుక్తంగా నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా దిల్ రాజు వంటి మేకర్ ఈ సినిమాకు వెన్నుతట్టి అన్ని విషయాల్లో ప్రోత్సహించారు. నా లాంటి ఒక దర్శకుడికి దిల్‌రాజులాంటి మేకర్ ప్రాత్సాహం ఉంటే ఆ సినిమా మేకింగ్, నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. దిల్ రాజు గారు నాతో చేతులు కలపడం ఎంతో ఆనందంగా ఉంది. నా ప్రథమ పుత్రిక నీలిమ గుణ. తను ఆర్ట్స్ అండ్ విజువల్ కల్చర్‌లో మాస్టర్స్ చేసింది. ఈ మూవీతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి దిల్‌రాజు ప్రోత్సాహం మరింత ఆనందదాయకం. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం చేయడమంటే మామూలు విషయం కాదు. శాకుంతలం సినిమాలో శకుంతలగా ఎవరు నటిస్తారని ఎన్నో కథనాలు వచ్చాయి. ఆ సున్నితత్త్వం ఎవరికి ఉంది? అనుకుంటుండగా..ముఖ్యంగా పబ్లిక్ నుండి చాలా విశేషంగా నాకు సమంత పేరు అందరూ సూచించారు. ఆమె చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటారు. ఈ కథ వినడంతోనే ఓకే చెప్పారు. శాకుంతలం సినిమాలోని శకుంతల భావాలను తను అర్థం చేసుకోవడం తనలో శకుంతలను చూసుకుని ఇలాంటి పాత్రలో నన్ను నేను చూసుకోవడానికి సిద్దంగా ఉన్నాను ఎలాంటి ఎఫర్ట్ కావాలన్నా పెడతాను అని దీని కోసం నాలుగు నెలల క్రితమే అన్నింటిని నేర్చుకున్నారు. క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకున్నారు. స్టోరీలో డెవలప్ మెంట్స్, పూర్తి స్క్రిప్ట్ వింటూ ఎంతో ఇన్వాల్వ్ అయ్యారు. దిల్ రాజు వంటి మేకర్, సమంతగారి లాంటి నటి ఉన్నప్పుడు కచ్చితంగా మనం అనుకున్నవిధంగా సినిమాను తీయగలం అన్న నమ్మకం కలిగింది. ముఖ్యంగా ప్రణయ కావ్యం, క్లాసికల్ సినిమాతోనే నిర్మాతగా పరిచయం కావాలనే నీలిమ ధృడంగా నిశ్చయించుకుంది. సమంతగారి పేరుని తనే మొదటగా అనుకుంది. వ్యాపార దృష్టితోనే కాకుండా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజుగారు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయితే అంత ఖర్చుపెట్టండి మీ వెనకాల నేను ఉన్నాను అని అన్నారు. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ గారిని కూడా నీలిమనే సెలెక్ట్ చేసింది. కథ గురించి అంతా తెలుసుకుని ఓకే చెప్పారు. సినిమాకు కావాల్సిన హార్స్ రైడింగ్, స్వోర్డ్ ఫైటింగ్ ఇలా అన్నీ నేర్చుకున్నారు. రేపు వీరిద్దరూ సినిమాలో శకుంతలా? దుష్యంతుడా? అనేలా పోటాపోటీగా ఉంటారు`` అన్నారు
చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ.. నిర్మాతగా నా మొదటి సినిమా. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అల్లు అరవింద్‌గారికి నా ధన్యవాదాలు. సమంత,హన్షిత చాలా సపోర్ట్ చేస్తున్నారు`` అన్నారు.
హీరో దేవ్ మోహన్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఓ రాజుగా దుష్యంతుడి పాత్రలో కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది. గుణ శేఖర్ లాంటి దర్శకుడితో పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. అసలు సిసలు నిర్మాత దిల్‌రాజుగారు మా వెనక ఉన్నారు. మీరు కూడా నన్నుఆదరిస్తారని అనుకుంటున్నాను. సమంతతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మాట్లాడుతూ.. నాకు ఎప్పుడూ ఓ చిన్న బాధ ఉండేది. నేను కొన్ని పాత్రలు పోషించలేనేమోనని అనుకున్నాను. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడికల్ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి. దిల్ రాజు గారు, గుణ శేఖర్ గారు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. వంద శాతం నేను చేయాల్సింది చేస్తాను. గుణ శేఖర్ గారు ప్రతీ సీన్‌ను అద్భుతంగా చెప్పారు. రిఫరెన్సెస్ అడిగితే కూడా లేదని నీలిమ చెప్పింది. అంతా దర్శకుడి మైండ్‌లోనే ఉందని అన్నారు. ఈ పాత్రను పోషించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ నా రేంజ్‌ను మించి ఉంది... అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను అన్నారు.
ఈ కార్యక్రమంలో దిల్‌రాజు కుమార్తె హన్షిత రెడ్డి పాల్గొన్నారు.
సమంత అక్కినేని, దేవ్ మోహన్ మరియు భారీ తారాగణం నటిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శేఖర్ వి జోసెఫ్. సంగీతం: మణిశర్మ, ఆర్ట్ డైరెక్టర్: అశోక్ కుమార్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, లిరిక్స్: చైతన్య ప్రసాద్, శ్రీమణి, కొరియోగ్రాఫర్: రాజు సుందరం, పిఆర్ఓ: బి.ఎ.రాజు, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్, అలగర్‌సమీ, స్టంట్ కొరియోగ్రాఫర్: వెంకట్, మేకప్ చీఫ్: రాంబాబు, కాస్ట్యూమ్ చీఫ్: అశోక్, సౌండ్ డిజైనర్: బిస్వదీప్ చటర్జీ, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, స్టిల్ ఫోటోగ్రాఫర్: దాసు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్: అనిల్ కుమార్, కృష్ణ చైతన్య, జానీ షేక్ యాకూబ్, అకిల్ కృష్ణ, సూర్య కిరణ్, లైన్ ప్రొడ్యూసర్: యశ్వంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొమ్మినేని వెంకటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమంబర్ జాస్తి, సమర్పణ: దిల్‌రాజు, నిర్మాత: నీలిమ గుణ, రచన- దర్శకత్వం: గుణశేఖర్.