హైదరాబాద్‌లోని చిత్రపురికాలనీలోని అవినీతి, అక్రమాలపై పోరాటం జరుగుతూనే వుంది. ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయిన అవినీతిని ఎండగట్టేందుకు చిత్రపురి సాధన సమితి, చిత్రపురి పోరాట సంఘం, ఓనర్స్ అసోసియేషన్ లు పోరాటాలు చేస్తూనే వున్నారు. కానీ నేటికి అవి పరిష్కారం కాలేదు. ఇక్కడ వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయా పోరాట సంఘాలు లిఖితపూర్వకంగా పోలీసు అధికారులకు, కలెక్టర్ల కార్యాలయానికి, సి.ఎం. దృష్టికి తీసుకెళ్ళారు. కానీ వారికి తగిన న్యాయం జరగలేదు. దానికి కారణం చిత్రపురి సొసైటీ కమిటీ పెద్దలు అధికార పార్టీ నాయకులకు, పోలీసు వారికి ముడుపులు చెల్లించడమేనని పోరాట సంఘాలవారు వాపోతున్నారు. చిత్రపురి అనేది అధికారయంత్రాంగానికి బంగారుబాతులా వుందని అందుకే పరిష్కారం కాలేదని పోరాట సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు.
మీడియా వల్లే డొంకదిలింది
ఇటీవలే వివిధ ప్రతికలలో చిత్రపురిలోని అవినీతిపై తాము చేస్తున్న పోరాటాల గురించి అధినేతలకు లిఖితపూర్వకంగా పోరాట సమితి నాయకులు డా. కస్తూరి శ్రీనివాస్, మద్దినేని రమేష్, ఎస్.ఎస్. మన్నెంవాసి, పద్మ వంటివారు అందజేశారు. అందుకు వెంటనే స్పందించిన ప్రతికాధినేతలు ఆయ ప్రతికలలోనూ టీవీలలోనూ రోజువారీ కథనాలు, కుంభకోణాలు ప్రచురించారు. దీంతో రాజకీయనాయకుల ఒత్తిడి పెరిగింది. వెంటనే చిత్రపురి సొసైటీ నాయకులు హుటాహుటిన సమావేశం అయి జూలై 3న శనివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం వాడిగా వేడిగా జరగనున్నదని సమాచారం.
అసలేం జరుగుతోంది
తెలుగు సినిమారంగంలోని 24 క్రాఫ్ట్‌లలోని కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కాలనీయే చిత్రపురి కాలనీ. డా. ఎం. ప్రభాకర్ రెడ్డి ఇతర సీనియర్ నటుల సేవాదృక్పథంలోని పుట్టినదే. 25ఏళ్ళ నాడు హైదరాబాద్‌లోని సీనీ కార్మికుల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నానక్‌రామ్‌గూడాకు వెళ్ళేదారిలో ఓ కొండ ప్రాంతాన్ని సీనీ కార్మికులకు ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాధికారులు లాంఛనంగా ప్రారంభించారు. కొన్నాళ్ళ ఆ కొండలలో ఏముంటామని గ్రహించిన సినీకార్మికులు ఎవ్వరూ ముందుకు రాలేదు. అక్కడ నిర్మాణాలు జరగలేదు. ఇక కొన్ని సీని కార్మిక సంఘాల సభ్యులు ఓ అసోసియేషన్‌గా ఏర్పడి చిత్రపురి సొసైటీగా మారారు. అందులో కొమరం వెంకటేష్, అనిల్ వల్లభనేని, కాదంబరి కిరణ్, తమ్మారెడ్డి భర్వాజ, కోటగిరి వెంకటేశ్వరరావు, దొర, మోహన్‌రెడ్డితోపాటు 10మంది సభ్యులు వున్నారు. అప్పటినుంచీ వారంతా కొండ ప్రాంతంలోని రాయిని, రప్పను, మట్టిని, కంకరను ఇలా ఏది అందితే అది అమ్మేసుకుని లెక్కలు చూపించడకుండా కోట్లు సంపాదించారు. ఆ తర్వాత నివాసాల నిర్మాణాలకు ఓ ప్రముఖ బిల్డర్ కంపెనీకి బాధ్యత అప్పగించారు. ఇక పనులు ప్రారంభం నుంచి వారినుంచి పర్సెంటేజ్‌తో కమీసన్లు తీసుకోవడం జరిగింది. ఇక సినీకార్మికులు పేరుతో సొసైటీవారు తమకు నచ్చిన వారికి, కుటుంబ సభ్యులకు, పోలీసు అధికారులకు, రాజకీయనాయకుల భార్యలకు అమ్మేసి దొంగ సభ్యత్వం ఇచ్చి వందల కోట్లు సంపాదించారని పోరాట సమితి నాయకులు మీడియా ముందుకు వచ్చి వివరించారు.
ఇప్పటికే సింగిల్ బెడ్‌రూమ్స్, త్రిబుల్ బెడ్‌రూమ్స్ నిర్మాణం జరిగింది. అందుకు బేంక్ నుంచి రుణం తీసుకున్నారు. ఆ రుణంతో పూర్తిచేశారు. అయితే అందులో సినీకార్మికులు చాలా తక్కువమందే వున్నారు. ఎక్కువభాగం బయటి వ్యక్తులకు అమ్మశారు. ఇంకా డబుల్, డ్యూప్లెక్స్, రో హౌస్‌లు నిర్మాణం చేయాల్సివుంది. కానీ అవి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీనికి కారణం సొసైటీ వద్ద ఫండ్ లేదనే సాకు చెబుతున్నారు. కానీ ఇప్పటికే ఫండ్ పేరుతో తీసుకున్న డబ్బును సొసైటీ నాయకులు మింగేశారని ఆధారలతోసహా పోరాట సంఘాలు నిరూపిస్తున్నాయి. దాంతో సొసైటీ నాయకులు గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చి తాము చిత్రపురిలోని డబుల్, డ్యూప్లెక్స్, రో హౌస్‌లు మా ఆధ్వర్యంలో పూర్తిచేయాలని చూస్తుంటే కొందరు పోరాట సమితి పేరుతో మాపై ఫిర్యాదులు చేసి అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అన్నీ చట్ట ప్రకారమే చేశామనీ, సభ్యులను బైలాస్ ప్రకారమే తీసుకున్నామని వారు తెలియజేస్తున్నారు.
పోరాట సమితి ఏమంటుంది!
సొసైటీ నాయకులు చెప్పేవనీ అబ్దాలేనని, సొసైటీ ఆరంభంలో సైకిల్‌పై వచ్చే అనిల్ అనే వ్యక్తి నేడు కోట్ల రూపాయలు సంపాదించాడనీ, టిడి.పి. హాయంలో కోట్ల రూపాయలు ఎన్నికలలో పట్టుబడ్డాడనీ, ఇవన్నీ చిత్రపురి డబ్బులేనని.. అవే వుంటే ఈపాటికి చిత్రపురిలో మిగిలివున్న బిల్డింగ్‌లు పూర్తయ్యేవని వాపోతున్నారు. ఇలా ప్రతి సభ్యుడు ఒకప్పుడు సామాన్యుడగా వచ్చి నేడు అవినీతి డబ్బుతో బి.ఎండబ్ల్యు కారలలో తిరుగుతున్నారనీ, వీరి అవినీతిలో సినిమాటో్రగఫీ మంత్రితోపాటు పలువురు రాజకీయ నాయకులు పాత్ర వుందని అవన్నీ మేము వివిద మీడియాలముందు పెట్టామని అందుకే వారు మాపై కక్షగట్టారని, రేపు శనివారం మీడియా సమావేశం పెట్టి, తాము పతివ్రతలమని చెప్పే ్రపయత్నం చేస్తున్నామని పోరాట సంఘం నాయకులు వివరించారు. మరి రేపు శనివారం సినీకార్మికులకు ఎటువంటి హామీ వస్తుందో చూడాల్సిందే.