ఆ మరుసటి రోజు నుంచి ఈ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో నష్టాల నుంచి గట్టెక్కేందుకు వీలుగా ఈ మూవీలోని పాటలను వీడియో సాంగ్‌ల రూపంలో విడుదలే చేస్తున్నారు. ఇందులోభాగంగా, మంగళవారం రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
"కలలో కూడా" అంటూ సాగే మెలోడియన్ సాంగ్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అనన్య, విజయ్ కెమిస్ట్రీ బాగా పండింది. తనిషఅ బాగ్చీ స్వరపరిచిన ఈ పాటను భాస్కర భట్ల గేయరచన చేశారు. సిధ్ శ్రీరామ్ ఆలచింపారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.