తెలుగు సినీ నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు తక్షణం ఎన్నికలు నిర్వహించాలంటూ మెగాస్టార్ చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన మా క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు, సీనియర్ నటుడు కృష్టంరాజుకు లేఖ రాశారు. చిరు లేఖ టాలీవుడ్‌లో పెద్ద సంచలనం రేపింది.
ముఖ్యంగా, ఈ లేఖపై పోటీలో ఉన్న వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరిపించాలని 'మా' క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, సీనియర్ నటుడు కృష్ణంరాజుకు చిరంజీవి రాసిన లేఖకు మద్దతు తెలిపేలా 113 మంది మా సభ్యులు స్పందించారు.