సూపర్ స్టార్ క్రిష్ణ 81 వ జయంతి సందర్బంగా అభిమానులు పలురకాలుగా పలుచోట్ల వేడుకలు చేస్తున్నారు. ఈరోజు ఆయన కొడుకు మహేష్ బాబు తన తండ్రిని తలచుకుంటూ ఇన్ స్ట్రాలో ఐ మిస్ యూ నాన్నా.. అంటూ గుర్తుచేసుకుని ఫొటోలు షేర్ చేశారు. తెలుగు చలన చిత్రరంగంలో ఓ ఐకాన్ గా నాన్నగారు వున్నారు. ఆయన చేసిన 350 సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.