టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు jallikattuకి మద్దతు తెలిపాడు. తన ట్విట్టర్లో #JusticeforJallikattu అంటూ పోస్ట్ చేసిన మహేష్ ఇంకా ఇలా పేర్కొన్నాడు. తమిళనాడు సంప్రదాయం జల్లికట్టు కోసం ధైర్యంగా ముందుకు ఉరుకుతున్న యువతను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. అంతేకాదు.. అందరూ కలిసి జల్లికట్టు కోసం పోరాడుతున్న తీరు, తమిళనాడు విద్యార్థులంతా తమ లక్ష్యం కోసం పోరాడుతున్న వైనం అభినందనీయం అంటూ కొనియాడారు.