మహేష్‌బాబుకు సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ ఇచ్చాక మరలా అనిల్‌రావిపూడితో ఓ కథను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని వచ్చింది. మరలా షెడ్యూల్ గేప్ వుంది. ఈలోగా ఆయనకు రాజమౌళి గతంలో చెప్పిన కథ ఖరారైంది. అది చేయాలంటే ఆర్.ఆర్.ఆర్. పూర్తికావాలి. అది ఎప్పుడు అవుతుందో తెలీదు. అందుకే ఈలోగా మరో సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.