రాబిన్‌హుడ్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గెట‌ప్‌? (video)

శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:54 IST)
Pavankalyan getup
క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రెండు సినిమాల్లో ఆయ‌న న‌టిస్తున్నా తాజాగా క్రిష్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇందులో పాత్ర గురించి ఎలా వుండ‌బోతుందో ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. ఆమ‌ధ్య పుట్ట‌నరోజున శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. న‌డుముద‌గ్గ‌ర క‌త్తి, న‌డ‌ముమీద చేయివేసి పోరాట యోధునిగా వున్న ఆ స్టిల్‌ను బ‌ట్టి ఇదేదో రాబిన్‌హుడ్ పాత్ర‌లాంటిద‌నీ, రాజుల గెట‌ప్ అని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వినిపించాయి.

అయితే తాజాగా ఈ చిత్ర క‌థ 17వ శ‌తాబ్దంలో హైద‌రాబాద్‌కు చెందిన ఓ పోరాట‌యోధుని క‌థ‌గా ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన గెట‌ప్ ఒక‌టి యూనిట్ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ ఫొటోల్లో పవన్ లుక్ పరంగా కొత్తగా ఉన్నాడు కూడా. ప్రస్తుతం ఈ లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. మ‌రి ఆరోజు ఇంకాస్త మెటీరియ‌ల్ అభిమానుల‌కు రానుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు