జియో ఫీచర్ ఫోన్ సూపర్ ఆఫర్.. రెండేళ్లకు నో రీ ఛార్జ్ రూ.1999తో కొత్త ఫోన్, అన్‌లిమిటెడ్ సేవలు

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (18:19 IST)
Jio
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం భారతీయులకు మరింత దగ్గరయ్యేందుకు చౌక ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా తాజాగా సూపర్ ఆఫర్‌తో పాటు జియో ఫోన్‌ను కస్టమర్లకు అందించేందుకు జియో శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 2జీ 'ముక్త్ భారత్' పేరిట న్యూ జియో ఫోన్ 2021 ఆఫర్‌ను అందించనుంది. ఈ రూ.1999 ప్లాన్ ద్వారా రెండేళ్ల పాటు అన్ లిమిటెడ్ సర్వీసులు పొందవచ్చు.
 
కొత్త జియో ఫోన్‌ను రూ.1999లకు పొందినట్లైతే.. రెండేళ్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను పొందే అవకాశం వుంది. అలాగే నెలకు 2జీబీ చొప్పున రెండేళ్ల పాటు అన్ లిమిటెడ్ డేటాను కూడా పొందవచ్చు. అలాగే 2.5ఎక్స్ ద్వారా కస్టమర్లు ఇదే తరహా ఆఫర్లతో పాటు నెట్‌వర్కులోను మార్పులుండేలా ప్లాన్‌ను పొందవచ్చు. 
 
భారతదేశంలో ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం జియోఫోన్ పరివర్తన యుగాన్ని ప్రారంభించింది. తద్వారా 100 మిలియన్లకు పైగా వినియోగదారులను జియోఫోన్ ప్లాట్‌ఫామ్‌లోకి విజయవంతంగా అప్‌గ్రేడ్ చేసింది. 
 
అయినప్పటికీ, 2జీలో చిక్కుకున్న భారతదేశంలో ఇప్పటికీ 300 మిలియన్ల మొబైల్ చందాదారులు ఉన్నారు. వీరి కోసం ‘2 జీ-ముక్త్ భారత్’ ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి, జియో మరో ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది జియోఫోన్, దాని సేవలను 300 మిలియన్ల ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఉన్న ఫీచర్ ఫోన్ వినియోగదారులు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంది. 
 
వాయిస్ కాల్ యొక్క ప్రతి నిమిషానికి రూ.1.20 నుండి 1.50 వరకు చెల్లిస్తుంటే, సంపన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రం ఉచిత వాయిస్ కాల్‌లను ఆస్వాదిస్తున్నారు. కనెక్షన్ చురుకుగా ఉండటానికి, ప్రాథమిక టెలికాం సేవలను పొందడానికి ప్రతి నెలా రూ.45, రూ.50లు చెల్లిస్తున్నారు. అయితే వాయిస్ కాల్‌ల కోసం ఇంత ఖరీదైన రేటును చెల్లిస్తున్న ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఇంటర్నెట్‌ను కూడా పొందే అవకాశానికి నోచుకోలేకపోతున్నారు. 
 
ఈ సందర్భంగా రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ ఇలా వ్యాఖ్యానించారు. "5 జి విప్లవం కోసం ప్రపంచం వేచి చూస్తున్న తరుణంలో, 2జి యుగంలో ఇంటర్నెట్ యొక్క ప్రాథమిక లక్షణాలను పొందలేకపోతున్న 300 మిలియన్ల మంది చందాదారులు భారతదేశంలో ఇంకా ఉన్నారు. గత 4 సంవత్సరాల నుండి జియో ఇంటర్నెట్‌ను ప్రజాస్వామ్యం చేసింది. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలను ప్రతి భారతీయుడికి అందించింది. టెక్నాలజీ ఇకపై ఎంచుకున్న కొద్దిమందికి ప్రత్యేక హక్కుగా మిగిలిపోయింది. ఇంకా తాజా న్యూ జియోఫోన్ 2021 ఆఫర్ ఆ దిశలో మరొక దశ. జియోలో, ఈ డిజిటల్ డివైడ్‌ను నిర్మూలించడానికి తాము ధైర్యమైన చర్యలు తీసుకుంటామని.. ఈ ప్లాన్‌లో చేరేందుకు ప్రతి భారతీయుడిని స్వాగతిస్తామని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు.
 
కొత్త జియో ఫోన్ 2021 ఆఫర్ 
కొత్త యూజర్లు : 
1. జియో ఫోన్ డివైజ్ ప్లస్ 24 నెలల అన్ లిమిటెడ్ సేవల కోసం రూ.1999లను చెల్లించాలి. తద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ డేటా ( ప్రతినెలా 2జీబీ హైస్పీడ్ డేటా), రెండేళ్లకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. 
 
2. జియోఫోన్ డివైజ్ ప్లస్ 12 నెలల అన్ లిమిటెడ్ సేవల కోసం రూ.1499 చెల్లించాల్సి వుంటుంది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ డేటా ( ప్రతినెలా 2జీబీ హైస్పీడ్ డేటా), ఏడాదికి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. 
 
అలాగే ఇదే ఆఫర్లతో వినియోగదారులు 2.5ఎక్స్ ద్వారా అదనపు నెట్‌వర్క్‌ను పొందవచ్చు. 
జియోఫోన్ 2021 ఆఫర్ = రూ.1999 
అదనపు నెట్‌వర్క్ కోసం.. రూ.5000 చెల్లించాల్సి వుంటుంది. 
ఫీచర్ ఫోన్ రెండేళ్ల సేవలతో పాటు అదనపు నెట్‌వర్క్ కోసం రూ.5వేలు చెల్లించాల్సి వుంటుంది. 
వాయిస్ సర్వీస్ రెండేళ్లకు = 3600 (రూ.149, 24 రీఛార్జ్‌లు) 
యావరేజ్ ఫీచర్ ఫోన్ = రూ.1200 - రూ.1500 వరకు చెల్లించాల్సి వుంటుంది. 
 
ఎగ్జైటింగ్ జియో యూజర్ల కోసం.. 
12 నెలల అన్ లిమిటెడ్ సేవల కోసం రూ.749 ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ డేటా (ప్రతినెలా 2జీబీ హైస్పీడ్ డేటా), ఏడాదికి రీఛార్జ్ చేసే అవసరం వుండదు. ఈ ఆపర్లు మార్చి 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా గల రిలయన్స్ రీటైల్ మరియు జియో రిటైల్ షాపుల్లో అందుబాటులో వుంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు