బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు విడాకులు తీసుకోవడం... ఆ తర్వాత కలిసి తిరిగేయడం మామూలే. ఇలాంటివి ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ జంట విషయంలోనూ చూస్తున్నాం అనుకోండి. ఇకపోతే బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్, అతడిని పెళ్లాడిన మలైకా అరోరా ఖాన్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
అర్బాజ్ ఖాన్ నా పిల్లాడికి తండ్రి, నా చెల్లి అమ్రితకు అన్నయ్య లాంటివాడు, నా తల్లిదండ్రులకు ఒక కొడుకు లాంటివాడు. నాకు మాజీ మొగుడు. ఐనా నేను అర్భాజ్ ఖాన్ ఫ్యామిలీతో చాలా కలిసిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఐతే తామిద్దరం ఎందుకు విడాకులు తీసుకున్నామో తమకు మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చింది.