ప్ర‌జ‌ల‌కి అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిల‌దీస్తా... మంచు మ‌నోజ్

మంగళవారం, 26 మార్చి 2019 (20:05 IST)
అంద‌రికీ చిన్న మాట చెప్పాల‌నుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డాల‌నుకునే మ‌నిషిని. ఒక మ‌నిషికి సాయం చేసేట‌ప్పుడు త‌న క‌ష్టం త‌ప్ప కులం, మ‌తం చూడ‌కూడ‌ద‌ని పూర్తిగా న‌మ్మే మ‌నిషిని. ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ కోసం చేసిన దీక్ష‌కి మ‌ద్ద‌తుగా నేను బ‌ల‌డింది పిల్ల‌ల భ‌విష్య‌త్ బాగుప‌డాల‌నే ఉద్దేశ్యంతోనే కానీ ఎటువంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాద‌ని నేను మ‌న‌స్పూర్తిగా చెప్ప‌గ‌ల‌ను. 
 
నేను చంద్ర‌బాబు నాయుడు గారి మ‌నిషిపై కాస్త క‌ఠినంగా స్పందించింది కేవ‌లం ఆయ‌న మా కాలేజీలపై మోపిన తప్పుడు ఆరోప‌ణ‌ల వ‌ల్ల త‌ప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. అది మా నాన్న‌గారి క‌ష్టార్జితంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని క‌ట్టిన కాలేజి. ఆరోజు రోడ్డు మీద మా నాన్న‌తో న‌డిచింది... ఒక పెద్ద మ‌నిషిపై తీవ్రంగా స్పందించింది కేవ‌లం మా పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతో మాత్ర‌మే. 
 
ఈ మంచు మ‌నోజ్, రాజ‌కీయ పార్టీల‌కి అతీతంగా ప్ర‌జాసేవ‌కి ఎప్పుడూ ముందుంటాడ‌ని ప‌దిమందికి మంచి చేసే కార్య‌క్ర‌మం ఎప్పుడు ఏ పార్టీ త‌ల‌పెట్టినా దానికి తాను మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌తాడ‌ని అలాగే ప్ర‌జ‌ల‌కి అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిల‌దీస్తాడ‌ని స‌విన‌యంగా మ‌న‌వి చేసుకుంటున్నాను. జై హింద్.. అంటూ మంచు మనోజ్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు