ఈమధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న నటీమణులు ఆ తర్వాత తామే తప్పు చేశామనీ, తమ భర్తలు చాలా మంచోళ్లని చెప్పుకోవడం ఎక్కువవుతోంది. ఇందుకు కారణాలు ఏమిటన్నది ప్రక్కనబెడితే తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చేరిపోయింది. జెంటిల్మన్, ఒకే ఒక్కడు, బొంబాయి వంటి హిట్ చిత్రాల్లో నటించి కుర్రకారును ఓ ఊపు ఊపిన మనీషా కొయిరాలా ప్రముఖ వ్యాపారవేత్త సమ్రాట్ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుంది.
2010లో నేపాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడితో తన వైవాహిక బంధం సాగడం దుర్లభం అంటూ అతడిని విమర్శిస్తూ ఫేస్ బుక్‌లో పోస్టులు కూడా చేసింది. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు క్యాన్సర్ బారిన పడి, ఆ జబ్బును జయించి బయటపడింది.
ఇకపోతే ఇటీవలే మరో బాలీవుడ్ కపుల్ హృతిక్ రోషన్-సుస్సాన్నే ఖాన్ విడిపోవడం, ఆ తర్వాత తన భర్త చాలా మంచివాడంటూ ఆమె కితాబివ్వడం తెలిసిందే. తన మాజీ భార్య కోసం హృతిక్ తన ఇంటి పక్కనే మరో ప్లాటు కొనివ్వడమూ తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్-రేణూ దేశాయ్ సంగతి గురించి వేరే చెప్పక్కర్లేదు.