గాయాలైనా షూటింగ్‌కు... అక్క ప్రియాంక నుంచి నేర్చుకున్నా... మన్నారో చోప్రా

మంగళవారం, 17 మే 2016 (16:33 IST)
నటి మన్నార్‌ చోప్రా తనకు గాయాలైనా.. కాస్త కోలుకోగానే షూటింగ్‌కు సిద్ధమైంది. తాను చేస్తున్న సినిమా తొలి షెడ్యూల్లో కుడి కాలికి బాగా గాయమైంది. దానివల్ల కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో... అనంతరం ఆమె షూటింగ్‌కు సిద్ధమైంది. తాజా చిత్రం 'జక్కన' చిత్రం షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌కు పయనమైంది. ఫొటోతో సహా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పెట్టింది.
 
మన్నార్‌ చోప్రా ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. సునీల్‌ వర్మ, సాయిధరమ్‌ తేజ చిత్రంలో నటించింది. గాయాలైనా పట్టుదలతో ముందుకు సాగడం.. చిత్రంలోని ఇతర సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పింది. ఇది తన సోదరి ప్రియాంకా చోప్రా నుంచి అలవర్చుకున్నట్లు పేర్కొంది. గాయనిగా, నటిగా, నర్తకిగా తాను ఆమె నుంచి స్పూర్తిగా తీసుకున్నట్లు తెలియజేసింది. బాలీవుడ్‌లో 'జిద్‌' సినిమాతో కెరీర్‌ను ఆరంభించి తొలి సినిమాతోనే పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌ టాలీవుడ్‌లో కూడా మరిన్ని చిత్రాలు నటించాలనే కోరికను వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి