మరోవైపు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. పైగా పవన్ కళ్యాణ్‌కి ఇది 25వ సినిమా కావడంతో సినిమాపై లెక్కల్లో చూపలేనన్ని అంచనాలు నెలకొన్నాయి.
పోస్టర్‌లో పవన్ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అదే పోస్టర్‌లో పవన్ కోపంతో ఎటో నడిచివెళ్తున్నట్లుగా కూడా చూపించారు. దీంతో పవన్ డిఫరెంట్ లుక్ ఈసినిమాలో కనిపించబోతున్నాడు. పవన్‌కు జంటగా కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ నటిస్తున్న ఈచిత్రానికి ఇంకా టైటిల్ ఫైనల్ చేయలేదు.