ఈ సమావేశంలో పేరు పొందిన సినీ రంగ కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొనబోతున్నారు. మణిరత్నం, ఎ. ఆర్. రెహ్మాన్, తాప్సీ, జయం రవి, శివరాజ్ కుమార్, ఫహద్ ఫాజిల్, సాబు శిరిల్, కార్తీక్ సుబ్బరాజు, పవన్ కుమార్, రీమా కళింగల్ తదితరులు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. తెలుగు నుండి రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో పాల్గొనబోతున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దక్షిణాది చిత్రసీమకు సంబంధించిన కీలక విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. అలానే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఓటీటీ రంగాల ప్రభావం సినిమా రంగం మీద ఎలా ఉందనే దానిపై కూడా విస్తృత స్థాయిలో చర్చింబోతున్నారు.