మెగా డాటర్ నిహారికా కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకలో నిహారికకు వచ్చిన కానుకలు కోట్ల విలువ చేసేవని తెలిసింది. పెళ్లి సందర్భంగా మెగాస్టార్ ఏకంగా రూ.2కోట్ల విలువైన కానుకను అందించగా.. మెగా హీరోలందరూ నిహారికకు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.5 నుంచి రూ. ఆరు కోట్ల వరకు ఉంటుందట.
తాజాగా నిహారిక పెళ్లికి ధరించిన చీరలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుకలో మంగళ స్నానానికి ఆకుపచ్చ చీరను, హల్దీలో బంగారు వర్ణం చీరను పెళ్లి కూతురు వేడుక కోసం నీలం బంగారు రంగు చీరను ఎంచుకుంది.
నిశ్చితార్థం వేళ.. నిహారిక తల్లి ధరించిన 32 ఏళ్ల నాటి చీరను నిహారిక ధరించింది. వాటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె మేకప్ ఆర్టిస్ట్ శాండీ వధువు చిత్రాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఇవన్నీ వైరల్ అయ్యాయి. తాజాగా తన కూతురి పెళ్లి కోసం నాగబాబు సుమారు రూ.3కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ పెళ్లిలో నిహారిక కట్టుకున్న చీర ఖరీదుపైనా నోరెళ్లబెడుతున్నారు. బంగారు వర్ణం డిజైనర్ శారీ కోసం ఏకంగా రూ.20లక్షలు వెచ్చించారన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.