ఎంతోమంది అతిరథ మహారధులు, రాజకీయవేత్తలు ఈ వేడుకకి రాబోతున్నారట. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈ వేడుకని దాదాపు 5 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడూ స్టేజి పెర్ఫార్మన్స్ చెయ్యని చిరు ఇప్పుడు ఇలా స్టేజి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారని తెలియగానే చిరంజీవి ఫ్యాన్స్ అన్నయ్య డ్యాన్స్ కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే.. మొన్నటికి మొన్న జరిగిన శ్రీజ సంగీత్‌లో చిరు స్టెప్లు వేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే.