నయనతార భర్తకు అదృష్టం తలుపుతట్టింది.. సీఎం స్టాలిన్‌తో సినిమా?

శనివారం, 9 జులై 2022 (16:54 IST)
నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌‌ను దర్శకత్వం చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.
 
అయితే ఇది సినిమా కాదు.. చెన్నైలో జులై 28 నుంచి ఆగస్ట్ 10 వరకు చెస్ ఒలింపియాడ్ పోటీలు జరగనున్నాయి. 186 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది చెస్ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరుకానున్నారు.
 
ఈ క్రమంలో పోటీలను తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కోసం ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఆ బాధ్యతలను విఘ్నేష్ శివన్‌కు అప్పగించింది. ఈ వీడియోలో సీఎం స్టాలిన్‌ కూడా నటించారు. 
 
తాజాగా చెన్నైలో నేపియార్ దగ్గర ఆయనపై కొన్ని సన్నివేశాలను షూట్‌ చేశారు. ఈ వీడియోకు ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహమాన్ స్వరాలు సమకూర్చడం విశేషం.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు