తెలుగు చిత్రపరిశ్రమలో విప్లవ వీరుడుగా గుర్తింపు పొందిన సినీ హీరో, దర్శక నిర్మాత ఆర్. నారాయణ మూర్తి గురించి బాహుబలి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అన్నదాత సుఖీభవ" సినిమా రీ-రిలీజ్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ, ఆర్.నారాయణ మూర్తి సినీ ఇండస్ట్రీని వీడి రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. అపుడే ఆయన అనుకున్నది సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి ఎవరెవరో వస్తున్నారని.. అన్నీ అర్హతలు ఉన్నా కూడా ఆయన ఎందుకు ఆ రంగంలోకి అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. నారాయణ మూర్తి రాజకీయాల్లోకి రావడానికి నాలుగు అర్హతలు ఉన్నాయని.. వాటిని వివరించి మరీ చెప్పారు.
* భార్య, పిల్లలు, కుటుంబ బాధ్యతలు లేవు.
* నిరాడంబర జీవి. ఎలాంటి ఆర్భాటాలు కోరుకోరు. అతి సామాన్యంగా బతికేస్తారు.
* ఆయన నడుస్తున్న గూగుల్. భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, ఆర్థిక, సామాజిక అవగాహన ఉన్న వ్యక్తి. గూగుల్ లేకుండానే అన్నీ అనర్గళంగా చెప్పేస్తారు.